Breaking News

‘ఢిల్లీకి వెళ్లడం ఇష్టంలేని అజిత్ దాదా మాత్రమే తెలుసు’

Published on Wed, 10/23/2024 - 11:24

ముంబై: తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తరచూ ఢిల్లీకి పర్యటించటంపై ఎన్సీపీ( ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడానికి ఇష్టపడని తన సోదరుడు గుర్తుకువస్తున్నారని అన్నారు. నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు.  అజిత్‌ పవార్‌ తరచూ ఢిల్లీకి వెళ్లటంపై  మీడియా అడిగిన ప్రశ్నకు సుప్రియా సూలే స్పందించారు.

‘‘ఢిల్లీకి వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడని అజిత్ దాదా మాత్రమే నాకు గుర్తున్నారు. కొన్ని నెలలు నేను ఆయనతో టచ్‌లో లేను. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. ఆయన ఢిల్లీకి ఎందుకు వచ్చారో నేను సమాధానం చెప్పలేను’’ అని అన్నారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం దాదాపు ఖరారు చేసినట్లు అజిత్ పవార్ మంగళవారం తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎ‍న్నికల్లో అధికార మహాయుత కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. బీజేపీ 152-155 సీట్లు, శివసేన (షిండే) 78-80  సీట్లు, ఎన్సీపీ( అజిత్‌ పవార్‌)కు 52 నుంచి 54 సీట్లలో పోటీచేసేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఇప్పటికే 99 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. శివసేన( షిండే) 45 మందితో మంగళవారం తొలి జాబితా విడుదల చేసింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)