Breaking News

రాహుల్‌ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు

Published on Sat, 03/08/2025 - 11:52

ముంబై: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్‌ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు  సంధించారు.

గురువారం ధారావిలోని ఛామర్‌ స్టూడియోను సందర్శించిన రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్‌ సుధీర్‌ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్‌ మీడియాలో  రాజ్బర్‌ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.

 అయితే ఒక కాంగ్రెస్‌ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్‌ ధారావిలో పర్యటించారంటూ సంజయ్‌ నిరుపమ్‌ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్‌ యూనిట్‌ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు.

 

ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్‌ కార్యాలయం కరెంట్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్‌ కాంగ్రెస్‌ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్‌ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్‌ యూనిట్‌ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్‌ నిరుపమ్‌ అన్నారు.

బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్‌ నిరుపమ్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్‌ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)