Breaking News

ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి

Published on Sat, 09/14/2024 - 18:53

శ్రీకాకుళం, సాక్షి:  వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు  మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్‌ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆమోదం విస్మయం కలిగించిందన్న  మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు..  

.. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది.

.. పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.

ఇదీ చదవండి: పవన్‌ అయినా స్పందించడేం?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)