అన్ని లెక్కలూ తేలుస్తాం..

Published on Sun, 10/01/2023 - 03:21

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది బినామీ బిల్డర్లతో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన బిల్డర్లపై చదరపు గజానికి రూ.50 చొప్పున పొలిటికల్‌ ఎలక్షన్‌ ట్యాక్స్‌ విధిస్తోందని, ఆ డబ్బులన్నింటినీ తెలంగాణకు తరలించాలని చూస్తోందని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు రేవంత్‌ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలిజ్వరం పట్టుకుంటే, కొడుకు పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నారని, నిండా అవినీతిలో మునిగి నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే బీఆర్‌ఎస్‌ నేతలు, కాంగ్రెస్‌ గురించి మాట్లాడతారా అని రేవంత్‌ రీట్వీట్‌ చేశారు.

పక్క రాష్ట్రం గురించిన మాటలను పక్కనపెడితే తెలంగాణలోని కల్వకుంట్ల ‘స్కామిలీ’గురించి చెప్పాలని, దళితబంధులో 30 శాతం కమీషన్ల గురించి, లిక్కర్‌స్కామ్‌లో కవిత వెనుకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న రూ.300 కోట్ల ఆరోపణల గురించి, భూములు, లిక్కర్‌ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడం లేదని కాగ్‌ కడిగేసిన విషయాల గురించి చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం కేటీఆర్‌ వల్ల కాదని ఆ ట్వీట్‌లో రేవంత్‌ స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)