Breaking News

పక్కా ప్లానేనా?.. అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? రాచమల్లు

Published on Sat, 11/09/2024 - 16:42

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.

‘‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.

‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్‌ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది.

..91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్‌ చేశారు.

..ఒక చిన్న సోషల్‌ మీడియా వర్కర్‌ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్‌లా..?. సోషల్‌ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్‌ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్‌ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్‌ అంటూ ఏబీఎన్‌ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్‌ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్‌ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు.

సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి?

..కేవలం సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది.

..ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్‌ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్‌ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)