Breaking News

వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌.. అగ్నిప్రమాదం కేసుకు రాజకీయ రంగు

Published on Sun, 07/28/2024 - 20:16

సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.

అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్‌గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)