Breaking News

రాహుల్‌లా ఎవ‌రూ ప్ర‌వ‌ర్తించకండి: ఎన్డీయే ఎంపీల‌కు మోదీ సూచ‌న‌

Published on Tue, 07/02/2024 - 13:16

న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ నేడు(మంగ‌ళ‌వారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో జ‌రిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీల‌ను ఉద్ధేశించి మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాహుల్‌ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు.  ఎన్డీయే కూట‌మి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాల‌ని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వ‌రుస‌గా మూడోసారి కాంగ్రేసేత‌ర పార్టీకి చెందిన నేత ప్ర‌ధాని కావ‌డాన్ని విప‌క్షాలు స‌హించ‌లేక‌పోతున్న‌ట్లు విమ‌ర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్‌ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిప‌డ్డారు. ఆయనలా ఎవ‌రూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.

సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్ల‌మెంట్‌కు రావాల‌ని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశార‌ని చెప్పారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అంశాల‌ను పార్ల‌మెంట్‌లో రెగ్యుల‌ర్‌గా ప్ర‌స్తావించాల‌ని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

‘నిన్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్‌ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్‌గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.

పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్‌ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు.  రాహుల్ గాంధీ ప్ర‌సంగానికి కౌంట‌ర్ మోదీ ఇస్తార‌ని, ఆ సందేశం ప్రతి ఒక్క‌ర్నీ ఉద్దేశించి ఉంటుంద‌ని రిజిజు పేర్కొన్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)