Breaking News

బండి సంజయ్‌కు పేర్ని నాని కౌంటర్‌

Published on Tue, 09/05/2023 - 18:52

సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలంగాణలో పదవి కోల్పోయిన ఓ వ్యక్తి ఏపీకి వచ్చి మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర కొందరు జీతానికి పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 

బోగస్‌ ఓట్లను తొలగించాలి..
కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి  ముఖేష్ కుమార్ మీనాతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. ఇక, సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు లేకుండా, బోగస్, ఇన్‌వాలీడ్‌ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలని కోరాం. గత 15 రోజులుగా రామోజీరావు, రాధాకృష్ణ, టీడీపీ కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఏదో చేస్తోందంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా?. 59 లక్షల ఓట్లు 2019కి ముందు డబుల్ ఉన్నాయని ఫిర్యాదు చేశాం. 

అప్పుడు రామోజీ కళ్లు ఏమయ్యాయి?..
వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు రాష్ట్రల్లో ఒకే వ్యక్తికి అధిక ఓట్లు ఉన్నాయి. అందుకే ఓటరు కార్డుకి ఆధార్‌ని అనుసంధానం చేయాలని కోరాం. ఒకే మనిషికి 2,3 ఓట్లు ఉన్నాయి.. వాటిని సరి చేయాలన్నాము. ఒకే ఇంట్లో  50 నుండి 1000 వరకు ఓట్లు ఉన్నవాటిని సరి చేయమని కోరాం. ఇవన్నీ అక్రమాలు 2019 ఓటర్ల జాబితాలోనే ఉన్నాయి. అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. కానీ, సరిచేయలేదు. విజయవాడ సెంట్రల్‌లో ఒకే ఇంట్లో 510 ఓట్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో నమోదు చేశారు. చంద్రబాబు పత్రికలు కథనాలు  రాసిన అన్ని ఓటర్లు పాత ప్రభుత్వంలో నమోదైనవే. చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు దృత రాష్ట్రుడు అయిపోయాడా?. 

బండి సంజయ్‌కు కౌంటర్‌..
తెలంగాణ నుండి పదవి పోయిన బండి సంజయ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూపీలో బీజేపీ చేసినట్టు మేము చేస్తున్నాం అని ఆ బీజేపీ నేత అనుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర జీతానికి కొందరు పనిచేస్తున్నారు. మేము దొంగ ఓట్ల ను చేరిస్తే ఓటర్ల సంఖ్య ఎందుకు పెరగలేదు అని ప్రశ్నించారు. 


ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్‌.. టీడీపీ నేత అరెస్ట్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)