Breaking News

‘దాడి జరిగిన వెంటనే క్లూస్‌ టీమ్‌ను ఎందుకు పంపలేదు?’

Published on Tue, 02/03/2026 - 18:10

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని  మండిపడ్డారు.

‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్‌ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.

‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్‌ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు

..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్‌లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త.

..ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు.  వైఎస్సార్‌సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్‌గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)