Breaking News

జగన్‌కు సన్నిహితుడనే నా తనయుడ్ని అరెస్ట్‌ చేశారు

Published on Sun, 07/20/2025 - 13:49

చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని..  ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన. 

సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు.  

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు,  లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన  నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది. 

మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్‌ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్‌ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది. 

అసలు లిక్కర్‌ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. 

ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో  ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు  తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)