Breaking News

పవన్ కల్యాణ్‌ Vs పవన్ కల్యాణ్‌.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి 

Published on Mon, 04/15/2024 - 18:46

పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు.

హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. 

ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు.

అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట..

ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు.

ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ  బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు.
-సిమ్మాదిరప్పన్న.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)