Breaking News

ఇదేంది‘రప్పా’..! అడ్డంగా దొరికిపోయిన టీడీపీ

Published on Fri, 06/20/2025 - 07:18

సాక్షి, నరసరావుపేట: అధికారపార్టీ అడ్డంగా బుక్కయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కూటమి నేతలు, వారి అనుకూల మీడియా రెండు రోజులుగా నానాయాగీ చేశారు. ‘‘సైకోలు వీరంగం చేశారు, నరకుడు భాష ఏంటి’’ అటూ పచ్చ పత్రికల్లో వార్తలు రాయడంతోపాటు టీవీ చానళ్లలో డిబేట్లు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ అభిమానులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేశారు. కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెట్టారు. పుష్ప సినిమాలోని రప్పా.. రప్పా.. పోస్టర్‌ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజపై టీడీపీ మైనార్టీ సెల్‌ సత్తెనపల్లి టౌన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులూ తక్షణం కేసు నమోదు చేశారు. తీరా చూస్తే రవితేజ టీడీపీ వాడేనని తేలిపోయింది. దీంతో అధికారపార్టీ అడ్డంగా దొరికిపోయింది.  

బయటపడిన అసలు నిజాలు  
పోలీసులు పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామానికి చెందిన బొల్లెద్దు రవితేజను బుధవారం రాత్రి  అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రవితేజ కుటుంబ సభ్యులు తాము టీడీపీ అభిమానులమని తమకు వైఎస్సార్‌సీపీతో సంబంధం లేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ చేతుల మీదుగా పచ్చ కండువా కప్పుకుని టీడీపీలో చేరామని ఫొటోలు చూపారు.

            బొల్లెద్దు రవితేజపై ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డు  

రవితేజ పేరు మీద ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డునూ వారే బయటపెట్టారు. దీంతో టీడీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. టీడీపీ సభ్యత్వం ఉండి వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నాడని, ఏ ఉద్దేశంతో హాజరయ్యాడు? రవితేజ వెనుక ఎవరున్నారంటూ సోషల్‌మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజ టీడీపీ కోవర్టేనని, వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఆలజడులు సృష్టించడానికే టీడీపీ నేతలు అతనిని పంపి కుట్రలు పన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. 

 

టీడీపీ నేతల కొత్త రాగం  
వైఎస్సార్‌సీపీ అభిమానులపై టీడీపీ చేసిన దు్రష్పచారం బూమరాంగ్‌ కావడంతో ఆ పార్టీ నేతలు కొత్త రాగం మొదలుపెట్టారు. రవితేజ తల్లిదండ్రులు టీడీపీ వారేనని, కానీ రవితేజ మాత్రం వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ బుకాయిస్తున్నారు. బీమా ఉందని టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంటూ పెదకూరపాడు నేతలతో వీడియోలు విడుదల చేయించారు. దీనికి సోషల్‌ మీడియా యాక్టివిస్టులు గట్టి సమాధానాలు ఇచ్చారు. కోట్ల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటూ మహానాడులో చేసే ప్రసంగాలన్నీ వట్టివేనా అంటూ ప్రశి్నంచారు. జీవిత బీమా ఉంటుందని ఆశచూపి ఇతర పార్టీల నేతలకూ సభ్యత్వాలు అంటగడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)