Breaking News

‘ఆలయాలపై కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?’

Published on Wed, 12/31/2025 - 13:52

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్‌ నిలదీశారు.

‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి‌ ఇదే నిదర్శనం

..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)