Breaking News

సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. అర్థమిదే: నాగార్జున యాదవ్‌

Published on Sun, 12/07/2025 - 15:30

సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.

‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్‌ నెట్‌వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్‌ నిలదీశారు.

‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్‌కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్‌తో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ‌ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని  నాగార్జున యాదవ్‌ తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)