బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 01/12/2026 - 13:30

సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై సంచలన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం సూచనలు బీజేపీకి అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఉపాధి హామీ కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించాం. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. వంద రోజుల పని దినాలను 125కి పెంచాం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయ పీక్ సీజన్‌లో కూలీల కొరత లేకుండా ఈ పథకంతో లబ్ది జరుగుతుంది. వ్యవసాయ సీజన్ లేనప్పుడు 125 పని దినాలు దొరికేలా కొత్త చట్టం చేశాం. రాష్ట్రాలకి అదనపు భారం వేయడమే కాదు.. కేంద్రం కూడా అదనంగా ఖర్చు పెడుతుంది. కేంద్రం కూడా 340 కోట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రాష్ట్రానికి వస్తాయి.

కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశాం. పథకాన్ని నీరుగార్చడం కాదు పటిష్ఠం చేశాం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా బాధ్యత కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ దేశంలో రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది అని చెప్పుకొచ్చారు.

బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి..‘బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించాం కదా. గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వస్తామా?. మళ్లీ గెలిచి దేశంలో ప్రధానిగా మోదీ అధికారంలోకి వస్తారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసు’ అని అన్నారు.

ఎంఐఎంపై వ్యాఖ్యలు..
పాకిస్తాన్‌లో హిందువులు లేకుండా చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటి?. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం నేతలు ఉన్నారు. అవగాహన లేకుండా దుందుడుకుగా వ్యవహరించడం అసద్‌కు అలవాటు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్‌ భూభాగంలో ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దేశం అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి పెట్టాం. దేశ రక్షణకు మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదు అని ఘాటుగా విమర్శలు చేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)