Breaking News

‘మహిళల గురించి మాట్లాడటం.. ఆ రెండు పార్టీలకు అలవాటే’

Published on Thu, 10/03/2024 - 11:30

హైదరాబాద్‌, సాక్షి: కుటుంబాలు, మహిళలు గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు అలవాటు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి. ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు.  మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాప్ చేసి విని బ్లాక్ మెయిల్‌తో డబ్బులు వసూలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు విన్నరనీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ఇలాంటి భాషతో తెలంగాణ రాజకీయాలను దిగజార్చూతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి.

..ఏకపక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇదివరకే సీఎంకు లేఖ రాశా. గతంలో కేసీఆర్ కూడా మూసి బ్యూటీఫికేషన్ అంటూ మార్కింగ్ చేశారు. దాన్నే ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకున్నారు. పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసి సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం పెట్టీ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి. డ్రైనేజీ, వరద నీటి డ్రైన్‌ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి. పేదలకు నిర్మిస్తామన్న ఇళ్లు ఏమైయ్యాయి. హామీలు పక్కదోవ పట్టించేలా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ దోవలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారు. కాంగ్రెస్- బీఆర్‌ఎస్‌ దొందూ దొందే. దొంగల పార్టీలు.. దోపిడీ పార్టీలు.

హైడ్రా అంటే రేవంత్. రేవంత్ అంటేనే హైడ్రా. హైడ్రాను పుట్టించిన రేవంత్ బాధ్యుడు. ధైర్యం ఉంటే ఫాం హౌజ్‌లు, బడా బిల్డింగ్‌లు కట్టిన వాళ్ళవి కుల్చండి. ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు? పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి ఆర్‌జీ, ఆర్‌ఆర్‌ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్లను కులిస్తే ఈ ప్రభుత్వం  కూలిపోతుంది. పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు. కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

చదవండి: Konda Surekha Controversy: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)