Breaking News

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి అమర్‌నాథ్‌

Published on Tue, 05/02/2023 - 18:35

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనేక ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మూలపేట పోర్ట్‌ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. మరో రెండున్నరేళ్లలో మూలపేట పోర్టు పూర్తి కానుంది. రేపు(బుధవారం) భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, డేటా సెంటర్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.

‘‘రూ.3,500 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరగనుంది. 2025 సెప్టెంబర్‌ లోపు ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేయాలన్నది లక్ష్యం. టెక్‌ పార్క్‌ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం. రూ.6,500 కోట్లతో భోగాపురం విశాఖ మధ్య 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. హైదరాబాద్‌-సైబరాబాద్‌ ట్విన్‌ సిటీస్‌ మాదిరిగా భవిష్యత్‌లో విశాఖ-విజయనగరం అభివృద్ధి చెందుతాయి’’ అని అమర్‌నాథ్‌ అన్నారు.
చదవండి: ‘చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ కలిసినా కాపులు కలవరు’

‘‘ఎప్పుడైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకువచ్చారా? 2019 ఫిబ్రవరి 15న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో కనీసం భూ సేకరణ, రన్ వే కోర్టు క్లియరెన్స్‌లు తీసుకోలేదు. సిమెంట్ పలక ఉంటే చాలు.. చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేస్తారు’’ అంటూ మంత్రి అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్‌.. మూడురోజుల పాటు భారీ వర్షాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)