Breaking News

‘చంద్రబాబు, పవన్‌ మధ్య సీట్ల పంచాయితీ తేలేది కాదు’

Published on Sun, 02/04/2024 - 20:33

పల్నాడు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి  అధికారంలో వస్తుందని.. అప్పటివరకు టీడీపీ, జనసేన సీట్ల పంచాయితీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు-పవన్‌ బీజేపీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్‌ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ అయ్యారని.. వారు అలా భేటీ అవుతునే ఉంటారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదని.. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో? మరోచోట నుంచి పోటీ చేస్తారో? తెలియదని  అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని.. యుద్ధం కూడా అయిపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని.. అప్పటిదాకా వాళ్లు(టీడీపీ-జనసేన) సీట్లు తేల్చుకోలేరని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్‌ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో ఏమో ముష్టివేస్తూ.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారని వివర్శలు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)