Breaking News

‘అర్బన్‌ నక్సల్స్‌’ ఆరోపణలు.. ప్రధాని మోదీకి ఖర్గే కౌంటర్‌

Published on Sat, 10/12/2024 - 16:20

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని ‘అర్బన్‌ నక్సల్‌’ నడుపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేసే హక్కు ప్రధాని మోదీకి లేదని మండిపడ్డారు. ‘అర్జన్‌ నక్సల్‌’ పేరుతో కాంగ్రెస్‌పై  ఆరోపణలు చేయటం బీజేపీకి ఓ అలవాటుగా మారిందని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అలా అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి? బీజేపీ అనేది ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసే హక్కు మోదీకి లేదు’’ అని ఖర్గే కౌంటర్‌ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్ 5న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వాషిమ్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్‌ నియంత్రిస్తోంది. ఆ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి. కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది. అందుకే ప్రజలను విభజించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండాలి’’ అని అని  అన్నారు.

అదేవిధంగా అక్టోబరు 9న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కూడా మోదీ.. కాంగ్రెస్‌పై అర్బన్‌ నక్సల్స​్‌ను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ వర్చువల్‌ మాట్లాడారు. ‘‘ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశంలోని మూడ్‌ని తెలియజేస్తోంది. కాంగ్రెస్ , అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు చూపించారు’’ అని అన్నారు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)