Breaking News

8 కోట్ల ఉద్యోగాలపై ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే: ఖర్గే

Published on Sun, 07/14/2024 - 15:30

ఢిల్లీ: దేశంలో  గడిచిన నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రధాని మోదీ  అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.  

‘‘ ప్రధాని మోదీ నిన్న(శనివారం) ముంబైలో ఉద్యోగాల కల్పనపై అబద్దాలు చెప్పారు.  నేషనల్‌ రిక్రూట్‌మెంట్  ఏజెన్సీ ( ఎన్‌ఆర్‌ఏ)పై మీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాను.  కోట్ల మంది యువకులు ఎన్‌ఆర్‌ఏ ఒక వరం. ఒకే  జనరల్‌ ఎగ్జామ్‌.. అనేక పరీక్షలను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అభ్యర్థులు సమయం, వనరులను ఆదా చేస్తుంది. 

.. దీంతో పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ నాలుగు ఏళ్లలో ఎన్‌ఆర్‌ఏ ఒక్క పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. దాని  నిర్వహణకు కేటాయించిన మొత్తం రూ. 1517 కోట్లకు కేవలం రూ. 58 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు.   ఎన్‌ఆర్‌ఏ అనేది ఉద్యోగాల నియామకానికి ఏర్పాటు  చేశారా?. లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ నిజర్వేషన్లను లాక్కోవడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేస్తున్నారా?’ ’అని మోదీపై ప్రశ్నలు సంధించారు.

శనివారం ప్రధాని మోదీ ముంబైలోని  ఓ కార్యక్రమంలో పాల్గొని రిజర్వు బ్యాంక్‌  రిపోర్టు ప్రకారం 2023-24లో భారత్‌ 4.7 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొత్తంగా నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి  ఉద్యోగాలపై  అసత్యాలు ప్రచారం చేసేవారిని మాట్లాడనివ్వకుండా చేసిందని ప్రతిపక్షాలను  విమర్శలు చేశారు. పెట్టుబడులు, మౌలిక వనరుల అభివృద్ధి, దేశాభివృద్దిపై అసత్యాలు  ప్రచారం  చేసే శత్రువులన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)