Breaking News

‘సీఎం రేవంత్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది’

Published on Wed, 02/11/2026 - 19:38

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరుణంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్‌ కొండంత  బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.  

రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా  పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు.

 

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)