Breaking News

బిగ్‌ ట్విస్ట్‌.. కొండా మురళీకి మళ్లీ నోటీసులు

Published on Sat, 06/28/2025 - 14:32

గాంధీభవన్‌లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఉల్టా వరంగల్‌ నేతలపైనే ఫిర్యాదు చేశారు. అయితే కాసేపటికే కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనకు ట్విస్ట్‌ ఇచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేసింది. 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దుమారాన్ని రేపాయి. వరంగల్ జిల్లాలోని సొంత పార్టీనేతలపై కొండా మురళి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతీకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చకు దారి తీసింది. 

ఈ నేపథ్యంలో శనివారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళిని హాజరయ్యారు. కమిటీ ముందు తనపై ఫిర్యాదు చేసిన నేతలపైనే ఆయన ఫిర్యాదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వని అం‍శాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోరింది. కొండా ఇచ్చిన సమాధానం తర్వాత  మిగత ప్రక్రియ ఉంటుందని కమిటీ తెలిపింది. 

కొండా మురళి ఇచ్చింది వివరణ కాదు: మల్లు రవి
కొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి‌ వరంగల్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్‌తో పాటు,క్రమ శిక్షణా కమిటీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. ఈ తరుణంలో ఇవాళ గాంధీ భవన్‌లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు. 

ఇదే అంశంపై క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి చిట్‌చాట్‌ నిర్వహించారు. కొండా మురళీకి నేనే ఫోన్‌ చేశా. ఇవాళ కమిటీ ముందుకు వచ్చారు. కొండా మురళీ ఇచ్చింది వివరణ కాదు. ఇది ఆరంభం మాత్రమే. కొండా మురళీ కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నాం.మా కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కొండా మురళీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరాను. వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాము. ఏ ఫిర్యాదులు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలని కోరినట్లు చిట్‌చాట్‌లో మల్లు రవి వెల్లడించారు.  

మళ్లీ రేవంత్‌ అన్నే సీఎం: కొండా మురళి
ఇక క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు. దయ చేసి నన్ను గెలకొద్దు. రాహుల్‌ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగగ్రెస్‌ను గౌరవిస్తాను. రేవంత్‌ అన్న మళ్లీ సీఎం అవ్వాలి. బీసీ నాయకుడు మహేష్‌ అన్నకు మరిన్ని పదవులు రావాలి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది నా అంతరాత్మకు తెలుసు. నేను కేసులకు బయపడేవాడిని కాదు.’ అని వ్యాఖ్యానించారు.  

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?