Breaking News

‘ప్రియాంకకు అంత సీన్‌ లేదు.. అదంతా రాహుల్‌ జిమ్మిక్కు’

Published on Mon, 06/24/2024 - 09:27

తిరువనంతపురం:  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల్లో  పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో.. వయనాడ్‌ వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన ఓ  లేఖ రాశారు. అయితే ఆయన రాసిన లేఖకూ కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సుందరేశన్‌ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ప్రజలకు రాసిన లేఖ కేవలం ఒక పొలిటికల్‌ జిమ్మిక్కులో భాగమని విమర్శించారు.  

ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘’ఇప్పటికే రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ప్రజలకు ద్రోహం చేశారు. ప్రతిసారి వయనాడ్‌ తనకు రెండో నివాసం,కుటుంబమని చెబుతారు. ఆయన చేసిన  వ్యాఖ్యలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఆయన తన సోదరిని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇదంతా తన కుటుంబం కోసం చేస్తున్నారు. ఇది కేవలం  ఒక జిమ్మిక్కు. వయనాడ్‌ ప్రజలు రాహుల్‌ గాంధీని నమ్మరు. ఎందుకంటే ఆయన చేప్పిన మాటలకు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకొలేదు’’ అని సుందరేశన్‌ అన్నారు.

ప్రియాంకా గాంధీ పార్టీలో, యూపీలో పెద్ద పేరు  ఉ‍న్నప్పుడు ఆమె  ఎక్కడ  ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. లోక్‌ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, అమెథీ స్థానాల్లో  ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు.  ఇదీ వారికి అనుకూలమైన స్థానమని కాంగ్రెస్‌ భావిస్తోందని మండిపడ్డారు. కానీ, ఈసారి తాము ప్రియాంకా గాంధీకి గట్టిపోటీ ఇస్తామన్నారు. ఇక్కడ ఎన్డీయే, యూపీఏ మధ్యే అసలు పోటీ నెలకొనుందని అన్నారు.    

రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ప్రజలకు రాసిన లేఖలో.. ‘‘ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశా. నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు. నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు ప్రేమను, ఆప్యాయత పంచారు. 

జూన్ 17న వయనాడ్‌ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకోవడం మీరు చూసి ఉంటారు. బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నా. ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు నా సోదరిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)