Breaking News

వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డి అరెస్ట్‌

Published on Tue, 11/18/2025 - 09:28

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్‌ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ.. నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదు అని అన్నారు. 

కేసు ఏంటంటే.. 
టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్‌ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

YSRCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి అరెస్ట్

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)