Breaking News

సిద్దూ, డీకేఎస్‌ అండ్‌ కో ప్రమాణం రేపే

Published on Fri, 05/19/2023 - 19:53

బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు(శనివారం, మే 20) ప్రమాణం చేయనున్నారు. ఇదే వేదికగా పీసీసీ చీఫ్‌  డీకే శివకుమార్‌ డిప్యూటీ సీఎంగా, మరో 28 మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్‌ కూర్పు కోసం సిద్ధూ, డీకేఎస్‌లు కలిసి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లారు. 

ఈ క్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్యనేతలను కలిశారు. అనంతరం  కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ భేటీ జరిగనట్లు తెలుస్తోంది. ‘‘మంత్రి వర్గ జాబితాను కాబోయే సీఎం, డిప్యూటీ సీఎంలు పార్టీ సెక్రటరీ ఇంఛార్జితో చర్చించాక సిద్ధం చేశారని, దీనికి పార్టీ అధ్యక్షుడి ఆమోదం లభించడమే తరువాయి’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే(మల్లికార్జున ఖర్గే తనయుడు) పేర్కొన్నారు.  ఇప్పటికే కేబినెట్‌ లిస్ట్‌కు ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది.

బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్‌డోర్‌ స్టేడియంలో శనివారం ముఖ్యమంత్రి, కేబినెట్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలను, మళ్లింపును ప్రకటించారు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)