ఫోన్‌ ట్యాపింగ్‌.. మరో బాంబ్‌ పేల్చిన కవిత

Published on Wed, 09/03/2025 - 14:23

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్‌ పేల్చారు. కేటీఆర్‌ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్‌ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.

ఫామ్‌హజ్‌ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. 

ఈ గ్యాంగ్‌ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్‌ఎస్‌లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. 

పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్‌ విషయంలో ఇ‍ద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్‌ఎస్‌ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)