Breaking News

ఇసుక, మద్యంలో కూటమి పెద్దల అవినీతి: కాకాణి

Published on Sat, 10/19/2024 - 11:43

నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో  శనివారం మీడియాతో మాట్లాడారు.  

‘‘సూపర్‌ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు  ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా  దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్‌  రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్  ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు. 

... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

.. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ  ఒక మంత్రి,   ఎమ్మెల్యే  లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.

చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు!

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)