Breaking News

వైఫల్యాలు బయటపడకుండా బాబు డైవర్షన్ పాలిటిక్స్: కాకాణి

Published on Mon, 09/09/2024 - 11:49

నెల్లూరు, సాక్షి: వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.  ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘ 1964 లోనే బుడమేరకు భారీ వరద వచ్చింది.. అప్పుడు పదిమంది మరణించారు. రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు.. వరద తీవ్రతను ఎందువల్ల గుర్తించలేదు. నీటిని విడుదల చేయాలని అధికారులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులను ఎందువల్ల  పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను నివాసం ఉంటున్న  ఇంటి నుంచి పునరావస కేంద్రమైన కలెక్టరేట్‌కి వెళ్లారు. వరదలు తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెబూతున్నారు. చంద్రబాబు ఉన్న ఇల్లు... నీటిలో మునిగింది అందువల్లే అక్కడికి పోవడం లేదు. హైదరాబాద్‌లో హైడ్రా కంటే ముందే రాష్ట్రంలో జగన్ అక్రమ కట్టడాలను కూల్చడం ప్రారంభించారు.

హైదరాబాద్‌లో హైడ్రా చర్యలను పచ్చ మీడియా ప్రశంసిస్తోంది.. కానీ గతంలో అక్రమ కట్టడాలను పడగొడితే మాత్రం అదే మీడియా గగ్గోలు పెట్టింది. వైఎస్‌ జగన్ మోకాలు లోతు వరద నీటిలో దిగి పరామర్శలు ప్రారంభించిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకు వచ్చిన రేషన్ వాహనాలనే ఇప్పుడు వాడుతున్నారు. వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే జగన్ పరిహారం చెల్లించారు. మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి.. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు  చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్  చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీకి వైఎస్సార్‌సీపీకి చెందిన వారి బోట్లు వచ్చాయని చెబుతున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి పచ్చ మీడియా ఎత్తుతోంది. రైల్ ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే... బాబుకు తప్పిన ప్రమాదం అంటూ ప్రచారం చేశారు. వరదల్లో ప్రాణాలు పోయిన అన్ని మరణాలను చంద్రబాబు హత్యలుగానే పరిగణించాలి’ అని అన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు