Breaking News

కొనసాగుతున్న లీక్స్‌.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?

Published on Thu, 06/13/2024 - 08:56

విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?..   

ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.

గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్‌ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్‌పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. 

ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్‌ ఇచ్చేశారు. 

ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్‌ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. 

ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్‌ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది.  సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్‌ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)