Breaking News

జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 01/05/2024 - 17:08

హైదరాబాద్‌, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్‌లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులపై మండిపడ్డారాయన. 

తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్‌ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్‌ఎస్‌ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్‌, హరీష్‌రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని. 


బీఆర్‌ఎస్‌ది కేసీఆర్‌ పాలన. కాంగ్రెస్‌ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్‌ఎస్‌కు లేదు.  కేసీఆర్‌ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)