Breaking News

‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’

Published on Fri, 06/19/2026 - 18:51

సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్‌.. ల్యాండ్ సెటిల్‌మెంట్‌ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.

‘‘సాయికృష్ణను ఈ నెల 8న  మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు  మాత్రమే కృష్ణలంక పీఎస్‌లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్‌లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్‌ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీస్‌ నుంచి ఓ ప్రైవేట్‌ హోటల్‌కు తీసుకెళ్లారు. ప్రైవేట్‌ హోటల్‌ రూమ్‌ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు

..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే  హోటల్‌ రూమ్‌ బుక్‌ అయ్యింది. హోటల్‌ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ ట్రీట్‌మెంట్‌ చేశారు. మణిపాల్‌ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్‌కు తీసుకెళ్లారు. ఆర్‌ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్‌లో సీసీ ఫుటేజ్‌ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్‌ పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)