Breaking News

సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్‌రెడ్డి

Published on Sat, 09/06/2025 - 17:53

సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.

‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.

మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్  చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)