Breaking News

సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్‌..

Published on Wed, 04/05/2023 - 15:54

సాక్షి, వరంగల్‌/హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కమలాపూర్‌, కరీంనగర్‌ టూటౌన్‌లో సంజయ్‌పై పేపర్‌ లీకేజీ కేసు నమోదైంది. ఆయనను హన్మకొండలో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఏ1గా బండి సంజయ్‌..
టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో ఏ1గా బండి సంజయ్‌ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్‌, ఏ3 మహేష్‌, ఏ4గా మైనర్‌ బాలుడు, ఏ5గా శివగణేష్‌ను పోలీసులు చేర్చారు. 120(బి) సెక్షన్‌ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు.

హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత..
హన్మకొండ కోర్టు వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు.

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
లోక్‌సభ స్పీకర్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బండి సంజయ్‌ అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై హైడ్రామా కొనసాగింది. థ్రిల్లర్ సినిమా తలపించేలా పలు ప్రాంతాలు తిప్పారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపి లీగల్ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది.

పేపర్ బయటకు వచ్చిన కేసులో అనౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్‌లో చూపి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులను, అరెస్టులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. బెయిలేబుల్ కేసులే అయినప్పటికీ దొంగలా రహస్యంగా కోర్టుకు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ, టెన్త్‌ పేపర్‌ లీకేజీలో కుట్ర ఉంది: మంత్రి సబితా
ఇదిలా ఉండగా, టీఎస్‌పీఎస్సీ, టెన్త్‌ పేపర్‌ లీకేజీలో కుట్ర ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్ర చేశారంటూ ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే పేపర్‌ లీక్‌కు పాల్పడ్డారని మంత్రి సబితా మండిపడ్డారు.
చదవండి: అర్థరాత్రి అరెస్ట్‌.. అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్‌ సతీమణి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)