Breaking News

లోకేష్‌, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Published on Wed, 08/23/2023 - 19:57

సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్‌, టీడీపీ నేతలపై గుడివాడ వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వంశీలను చంపుతానన్న లోకేష్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. లోకేష్‌, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావుపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే చంద్రబాబు, లోకేష్‌ లక్ష్యం. దమ్ముంటే తండ్రీకొడుకులు గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి. టీడీపీ సైకోలందరినీ పెట్టుకుని సభలో చెలరేగారు.’’ అని గుడివాడ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

కాగా, నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న(మంగళవారం) సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్‌

వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)