Breaking News

నా ఇంటిపై ఏసీబీ దాడులు.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

Published on Mon, 01/06/2025 - 10:38

హైదరాబాద్‌, సాక్షి: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన వేళ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని, తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని రేవంత్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారాయన.

సోమవారం ఉదయం తన లీగల్‌ టీంతో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్‌ చేరుకున్నారు. అయితే తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులను నిలదీశారు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు.

‘‘పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే.. అందుకే లాయర్‌తో వచ్చా. నాతో పాటు లాయర్‌ వస్తే వాళ్లకేంటి(పోలీసులకు) ఇబ్బంది ఏంటి. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో జరిగిందే నా విషయంలో జరగబోతోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు.  ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. నేను ఏ తప్పు చేయలేదు..  నిజాయితీగా ఉన్నా. అందుకే చట్టాన్ని గౌరవించి విచారణకు వచ్చా.

రాష్ట్రంలో రేవంత్‌ రాజ్యాంగం నడుస్తోంది. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీ దాడులు చేయబోతున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు.   తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఎందుకీ డ్రామాలు(కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది). అయినా నేను కేసులకు భయపడను. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతాం’’ అని కేటీఆర్‌ అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)