Breaking News

పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని

Published on Tue, 05/27/2025 - 12:47

సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు.

..డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.

కట్టుకథలతో కేసులో ఇరికించారు..
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు.

రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెళ్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)