Breaking News

త్వరలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్‌: హరీష్‌ రావు

Published on Sat, 01/06/2024 - 13:45

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హరీష్‌ రావు. 

కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని నేతలు, బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘కేసీఆర్‌ కోలుకుంటున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతీ రోజూ కార్యకర్తలను కలుస్తారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయి. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోంది. 

కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోంది. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా బస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)