Breaking News

అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్‌

Published on Fri, 08/01/2025 - 12:20

సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్‌ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్‌ సవాల్‌ విసిరారు.

తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్‌కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్‌ మండిపడ్డారు.

‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)