Breaking News

వాళ్లు ఓటు వేస్తే.. 40 సీట్లు గెలిచేవాళ్లం: సీఎం ఏక్‌నాథ్ షిండే

Published on Sun, 07/07/2024 - 07:52

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో తమ మహాయుతి  కూటమికి సీట్లు తగ్గటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం ఎక్‌నాథ్‌ షిండే పాల్గొని మాట్లాడారు. 

‘‘లోక్‌సభ పోలింగ్ రోజు మహారాష్ట్రలో మా కుటమికి అనుకూలంగా ఓటువేసే సంప్రదాయ ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు రాకుండా హాలీడే తీసుకున్నారు. అందుకే మహారాష్ట్రలో మహాయుతి కుటమికి సీట్లు తగ్గాయి. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటం వల్ల ఎన్డీయే కూటమి 400 సీట్ల​ మార్క్‌ను దాటలేకపోయింది. ఇలా జరగకపోతే  ఎన్డీయే 400  సీట్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది. 

ఈ నష్టం మమ్మల్ని భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. పోలింగ్‌లో 60 శాతం ఓటర్లు పాల్గొని ఉంటే  మేము కచ్చితంగా 40 సీట్లు గెలిచేవాళ్లం. లోక్‌సభ ఎన్నికల అనుభవాన్ని సమీక్షించుకుంటున్నాం’’ అని అన్నారు. 

అదే ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీలో సీఎం  దేవేంద్ర ఫడ్నవిస్‌ మాట్లాడారు. సీఎం ఎక్‌నాథ్‌ షిండే చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అదేవిధంగా  లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కూటమి వ్యాప్తి చేసిన అసత్య ప్రచారాన్ని తమ  కూటమి నేతలు పట్టించుకోలేదని అన్నారు. దానివల్ల కూడా తమకు సీట్లు తగ్గినట్లు  అభిప్రాయపడ్డారు.

మొత్తం 48 సీట్లలో ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 30 సీట్లు  గెలుచుకుంది. ఇక.. మహాయుతిలోని బీజేపీ 9, శివసేన(షిండే) 7 సీట్లు మాత్రమే సాధించిగా.. ఎన్సీపీ ఖాతా కూడా తెరవలేదు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)