Breaking News

కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయొచ్చు!: సీఎం రేవంత్‌

Published on Wed, 07/31/2024 - 18:32

సాక్షి, హైదరాబాద్‌: కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారని, తనను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని ప్రస్తావించారు. 

తన వద్దకు 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లినట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌తో మాట్లాడారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై  ఇంత చర్చ జరగలేదన్నారు సీఎం రేవంత్‌. ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తుందని అన్నారు.  ఒక్క రోజు 17 గంటల పాటు సభ నడిచిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టామని. నేడు మొత్తం బడ్జెట్‌కు ఆమోదం తెలిపామని చెప్పారు.

మోసం అనే పదానికి సబితా ప్రత్యామ్నాయం
‘మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి చెప్పారు.అంతకుమించి సమాధానం ఏముంటుంది. సునితా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే  నాపై రెండు కేసులు పెట్టారు.తరువాత ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను. నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. వాళ్లు ఎందుకు బాధపడ్డారు. రియాక్ట్‌ అయ్యారు.

అక్క అనే అన్నాను.. వేరే భాషలో మాట్లాడలేదు
నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అక్క.. నాకు తోడుండాలి కదా. కానీ ఆమె బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్‌ రాగానే సబిత పార్టీ మారారు. సభలో హరీష్‌ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్‌ 2 గంటల 36 నిమిషాలు మాట్లాడారు. ఇంతకంటే ఎక్కువ సేపు మాకు ఎప్పుడైనా మైక్‌ ఇచ్చారా? మాకంటే వాళ్లే ఎక్కువ సేపు మాట్లాడారు.

రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే.. ఆ తరువాత నేను మాట్లాడాను. సబితక్క ఆవేదనకు కేటీఆర్‌, హరీశ్‌ ఎందుకు అండగా లేరు? కేటీఆర్‌,హరీష్‌లు తాము సభలో సరిపోతామని చెబతున్నారు. అలాంటిప్పుడు కేసీఆర్‌ను ఫ్లోర్‌ లీడర్‌గా తీసేయండి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్‌ సభకు వస్తున్నారు.’ అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)