Breaking News

ఏడాదికే బండి బోరుకొచ్చేసిందా.. బాబు సర్వేలో ఇదే తెలిసిందా?

Published on Sat, 06/07/2025 - 12:17

నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి ఎన్నికలకు ముందు పొత్తుకోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అదీకాకుండా పవన్ కళ్యాణ్.. కాపు ఓట్లు.. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కనిపించిన ప్రతివ్యక్తికి.. ప్రతి కులానికి.. ప్రతి వర్గానికి నోటికొచ్చిన హామీ ఇచ్చి గెలిచి ఏడాదైంది.

ఏడాదిలో చాలా చేసేసాం అని బయటకు మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోన బాబులు ముగ్గురిలోనూ గుబులు మాత్రం కలుగుతోంది. ముగ్గురు కలిసినా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలిమాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.

బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును మదింపు చేసుకుంటున్నారు అంటే లోలోన చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్‌కు గట్టిగానే డౌట్ కొడుతోందని అర్థం అవుతోంది. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా బాబు గారి పాలన ఎలా ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు.. ప్రజలు ఆ కాల్ రాగానే.. తుపుక్.. తుపుక్ అని సమాధానాలు ఇస్తుండటంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయకపోవడంతో జనం ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. పైగా అభివృద్ధి.. సంక్షేమం వంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. అనవసరమైన అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఏవగించుకుంటున్నట్లు తెలుస్తోంది.  

కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని అంటున్నారు. ఏడాదిలోనే ప్రజల్లో ఇంట నగుబాటు మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి ఉంటుందని కొందరు సర్వేలో చెబుతున్నారు. గ్రేటాంధ్ర.. ది తెలుగు న్యూస్.. జర్నలిస్ట్ సాయి వంటి వాళ్ళు పెట్టిన ఆన్‌లైన్‌ పోల్‌లో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని అంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)