Breaking News

సింగిల్‌గా అయితే సీన్ సితారే

Published on Sat, 06/28/2025 - 20:18

ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్‌కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.

మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్‌తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.

నిత్యం వైఎస్‌ జగన్‌ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.

హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత  వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది.  ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.

అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్‌తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.

ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్‌లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్‌తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్‌పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ  శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..

* సిమ్మాదిరప్పన్న

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు