Breaking News

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం

Published on Wed, 06/12/2024 - 07:58

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. 

ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు, టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు.. 

.. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు  హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. 

తమిళిసైకి షా వార్నింగ్‌
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అ‍గ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మెగా బ్రదర్స్‌తో మోదీ సందడి
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.


 

 

కేంద్ర మంత్రి అమిత్‌ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 

రామ్మోహన్‌ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనం

వేదికపైకి చేరుకున్న రజినీకాంత్‌

రజినీకాంత్‌ దంపతులతో నందమూరి బాలకృష్ణ

➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం

➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే

➡️ పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ

పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ


 ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)