Breaking News

బీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌లోకి సీనియర్‌ ఎమ్మెల్యే!

Published on Mon, 08/28/2023 - 14:40

సాక్షి, నిర్మల్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్‌ పెంచాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి విడతలో భాగంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో, టికెట్‌ పొందని అభ్యర్థులు అధిష్టానంపై సీరియస్‌ అవుతున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు ఇప్పటికే జంప్‌ అయ్యారు. 

తాజాగా ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. కాగా, రేఖానాయక్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాను. నా భర్త కూడా కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తాను. ప్రజలందరూ నాతో పాటు ఉన్నారు. నాయకులు పోయినంత మాత్రాన నాకు ఏలాంటి నష్టం లేదు. ఓటర్లు మాత్రం నాతోనే ఉన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు వారికి సేవ చేస్తూనే ఉంటాను. 

ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడికి ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరు. ఓటర్లు నాతోనే ఉన్నారు. సదరు వలస నాయకుడిని ప్రజలు ఓడిస్తారు. నా నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాను. నన్ను ఎవరూ ప్రజలు నుండి దూరం చేయలేరు. సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం.. సహనం కోల్పోయి జనంపై చిందులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)