Breaking News

అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్‌ సెటైర్లు

Published on Sun, 02/08/2026 - 11:15

సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్‌ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్‌ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.

  • జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్

  • ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్

  • మార్చి: సాండ్  స్కామ్

  • ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్

  • మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్

  • జూన్: ఫోర్త్ సిటీ స్కామ్

  • జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్

  • ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్

  • సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్

  • అక్టోబర్: పవర్ స్కామ్

  • నవంబర్: సింగరేణి స్కామ్

  • డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.


కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.

రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...
గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌కు చెప్పి రైతు బంధు  వేయించాను’ అని చెప్పుకొచ్చారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)