Breaking News

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్‌!

Published on Mon, 09/01/2025 - 19:54

సాక్షి,హైదరాబాద్‌: ‘కాళేశ్వరం పాపం హరీష్‌రావు,సంతోష్‌రావుదేనంటూ’ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్‌ మీడియా అకౌంట్లను అన్‌ ఫాల్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సైతం హరీష్‌రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్‌గానే’ వస్తుందని ట్వీట్‌ చేయడం చర్చాంశనీయంగా మారింది.  

హరీష్‌రావు,సంతోష్‌రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్‌రావుపై బీఆర్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది.  

అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మీడియా గ్రూప్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్‌వో నవీన్‌ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్‌వో నవీన్‌ బీఆర్‌ఎస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్‌రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్‌వో నవీర్‌ను గ్రూప్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తొలగించింది.  బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్‌ మీడియా అకౌంట్లకు అన్‌ఫాలో చెబుతున్నారు.   

కవిత వ్యాఖ్యలతో  బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు.  వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)