Breaking News

ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీఆర్‌ఎస్‌

Published on Tue, 07/11/2023 - 12:49

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు(మంగళ, బుధవారం) బీఆర్‌ఎస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ టీకాంగ్రెస్ చీఫ్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.

ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ బయటపెట్టుకుందని అన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి ఆయన పిలుపునిచ్చారు.
చదవండి: రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వొద్దు..: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా, అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సోమవారం తానా మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్నది మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని, ఎకరాకు సాగునీరు పారించాలంటే ఒక గంట, అదే మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని అన్నారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. 

కేవలం విద్యుత్‌ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని అనుచితంగా వ్యవహరించవద్దని అన్నారు. మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)