Breaking News

చిప్‌ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స

Published on Sat, 02/07/2026 - 13:19

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  

‘‘ఒక మాజీ మంత్రి నివాసంపై పెట్రోల్‌ బాంబులు వేయడం ఏంటి?. పెట్రోల్ బాంబులు వేయడాన్ని జై ఆంధ్ర ఉద్యమం సమయంలో చూశా. పోలీసులు ఉంది దేనికి అసలు?. పోలీసులంటే దాడులు ఆపాలి. అదీ పోలీసింగ్‌ అంటే. కానీ, ఇక్కడ పోలీసులు గూండాలకు ఎస్కార్టులుగా, రక్షణగా ఉంటున్నారు. పోలీసులు, గూండాలు కలిసి దాడికి వస్తారా?. ఇదెక్కడైనా చూశామా?. 30 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు. ఇంటిపై దాడి చేస్తే ఏ కేసులు పెట్టాలి?. ఏ సెక్షన్లు పెట్టాలి?. దాడులు చేసిన నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తారా?..304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు...కారణమేంటి?. 

.. జోగి రమేష్‌ ఇంటిపై దాడి హేయమైన చర్య. ఈ దాడి క్షణికావేశంలో జరిగింది కాదు. ఇది పక్కా ఆర్గనైజ్డ్ దాడి. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఏదైనా జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి. చంద్రబాబూ.. అసలు మీ ఆలోచన ఏంటి ?. జోగి రమేష్‌ అన్నదాంట్లో తప్పేముంది?. ఆయన చెప్పినట్లు మంత్రి లోకేష్‌కే కాదు చంద్రబాబుకి కూడా చిప్‌ పోయినట్లు ఉంది. చిప్‌ పోతేనే ఇలాంటి పనులు చేస్తారు. రాజకీయాల్లో సంమయనం పాటించాలి కానీ.. ప్రతీకారాలకు పాల్పడకూడదు. జోగి రమేష్ కు కూడా నేను ఇదే సూచించా. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకోవద్దని జోగి రమేష్ చెప్పా. ఈ ప్రభుత్వం చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం..

..చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?.  రాష్ట్రంలో అసలు పాలన ఉందా?. శాంతి భద్రతలు అసలు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి దాడులు రాజకీయంగా చాలా తప్పు. ప్రజాస్వామ్యం గురించి చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. తాను ఏం మాట్లాడుతున్నారో .. తాను చెప్పిన సనాతన ధర్మమేంటో పవన్ తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నా దాడులు ...ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు పవన్‌కు కనిపించడం లేదా?. 

.. రాజకీయంగా మీరు తప్ప వేరే ఎవరూ బ్రతక కూడదా?. చంద్రబాబూ.. ఏమైంది మీ జ్ఞానం?. మీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌సీపీ బెదరదు. ఈ దాడుల పై న్యాయపోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గపు ఆలోచనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి గెలిపించడం ధర్మమేనా ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం ప్రమాదకరం’’ అని బొత్స అన్నారు. 

జోగి రమేష్‌ను పరామర్శించిన బొత్స

ఈ ప్రభుత్వానికి అసలు ఆలోచన ఉందా... ప్రతీదీ డైవర్షన్ చేయడమేనా?. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ చెప్పింది. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయిస్తారా?. లడ్డూ వ్యవహారం పై సిట్ ఏమి చెప్పిందో మీరెందుకు చెప్పలేకపోతున్నారు. లడ్డూ అంశం పై ఏకసభ్య కమిషన్ వేయడం దేనికి?. పవన్ ,లోకేష్ ,బీజేపీ నేతలను ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయొచ్చు కదా!. ఆ దేవదేవుడిని ఎందుకు రోజూ కించపరుస్తున్నారు?. దేవుడితో రాజకీయాలెందుకు?.. దేవుడే అన్నీ చూస్తున్నాడు. తప్పు చేస్తే..తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది...అంతే కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన వారిని ఎవరినీ వదలం. చట్టముందు దోషులుగా నిలబెడదాం..

ఈ ప్రభుత్వం తీరు ఆడలేక మద్దెల ఓడ మాదిరి ఉంది. చంద్రబాబు తనను విశ్వామిత్రుడు, వశిష్టమహర్షిగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిందే నిజం అనుకుంటున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందని ఎన్ని కేసులైనా పెడుతుంది ఈ దుర్మార్గపు ప్రభుత్వం. మా నేతల పై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఇది అని బొత్స మండిపడ్డారు.

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు