Breaking News

సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం

Published on Thu, 05/01/2025 - 17:45

విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాద ఘటన జరిగిందని.. అలాంటిది ప్రభుత్వ అధికారులతోనే విచారణ జరిపిస్తే ఫలితం ఏముంటుందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. సింహాచలంపై జరిగిన బాధాకరం. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రచార పిచ్చి ప్రమాదానికి కారణం అయింది. వీఐపీలకు దర్శనం కల్పించడం మీద ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం.

మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామన్నారు. సింహాచలంపై ఏడుగురు గురు భక్తులు చనిపోయిన సంఘటన ఎన్నడు జరగలేదు. మరణాలపై చంద్రబాబు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. మరణాలపై ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మరణాలపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. 

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపితే ఏమి లాభం?. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ ఎందుకు వేయలేదు. జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే వైఎస్సార్‌సీపీ తరఫున మేం డిమాండ్‌ చేస్తున్నాం.  

కమిటీ ముందు కాంట్రాక్టర్‌ నిజాలు చెప్పాడు. నాలుగు రోజుల్లో గోడ కట్టామని చెప్పారాయన. ఆ గోడకు డిజైన్, టెండర్ లేవు. కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. 

దేవాలయాలు భక్తులు అంటే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కొండపై 7 మంది చనిపోతే కనీసం శుద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మరణాలు తరువాత సంప్రోక్షణ చేయడం మన సంప్రదాయం. 

ప్రమాద ఘటనపై పరామర్శకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు?. జనసేన కార్యకర్త అయితేనే పవన్ పరామర్శ చేస్తారా?. మిగతా వారిని పరామర్శించరా?.

ప్రభుత్వంలో ఉండి మీరు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం అని బొత్స అన్నారు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)