Breaking News

‘చాడీలు చెప్పి సానుభూతి ప్రయత్నాలు చేశారేమో!’

Published on Thu, 10/12/2023 - 18:24

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్‌ బీజేపీ వాళ్లకు తెలిసే జరిగిందంటూ ఆరోపించిన టీడీపీ వాళ్లు.. తాజాగా అమిత్‌షాతో నారా లోకేష్‌ భేటీని ఎలా చూస్తారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఈ పరిణామంపై స్పందనతో పాటు విశాఖ రాజధానికి సీఎం తరలివెళ్లడంపైనా యెల్లో మీడియా కథనాల్ని విజయవాడలో ఖండించారాయన. 

ఢిల్లీలో తాజా పరిణామంపై బొత్సకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానంగా..  ‘‘ చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో నాకేం తెలుసు?.. తల్లి, కొడుకులు కలిసి వెళ్లి అమిత్ షాని కలిసి  బాధలు చెప్పుకున్నట్లు ఉన్నారు. మా మీద చాడీలు చెప్పి, సానుభూతి పొందడానికి ప్రయత్నించి ఉంటారు. లోకేష్ మాపై చాడీలు చెప్పకుండా..  సీఎం జగన్ మమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్తాడా ఏంటి?’’ అని వ్యంగ్యం ప్రదర్శించారు.

దొంగ ఎక్కువకాలం దొర లాగా ఉండలేరు. దొంగలు ఎప్పటికైనా దొరక్క తప్పదు. సుజనా చౌదరి వాళ్ళు బీజేపీ బీటీమ్‌. టీడీపీ వాళ్లే కదా..నిన్నటి వరకు బీజేపీ కి తెలిసే అరెస్ట్ చేసారని చెప్పారు. మరి ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి కలిశారు?. లోకేష్‌ వెళ్లినప్పుడు.. పురందేశ్వరి అక్కడున్నారంటూ టీడీపీ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ సమావేశంలో ఏం జరగిందో ఆమెనే చెప్పాలి అని బొత్స అన్నారు. 

యెల్లో మీడియా కథనంపై..
దొడ్డిదారిన ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు జీవో ఇచ్చారంటూ టీడీపీ అనుకూల మీడియా కథనం ప్రచురించింది. దీనిపైనా బొత్స స్పందించారు. ఓపెన్ గా జీవో ఇస్తే..దొడ్డిదారి అని పత్రికలు రాయడం హాస్యాస్పదం. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలని జీవో ఇచ్చారు. రాయలసీమ రీజియన్ లో కడపలో సీఎం కి నివాసం ఉంది కదా?. ఈ ఉగాది కి తెలుగుదేశం పార్టీ, సెలబ్రిటీ పార్టీలు ఉండవు. ఎందుకంటే.. అప్పటికి ఎన్నికలొస్తాయి. ఓటమి పాలై కథ క్లోజ్‌ అవుతుంది? అని బొత్స పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)